మంగళ, శుక్రవారాలలో ఈ చిన్న పని చేస్తే సమస్త గ్రహ దోషాలు నివృత్తి అవుతాయట.


మంగళవారం, శుక్రవారం రాహుకాలంలో దుర్గా దేవి గుడి వద్ద ఒక నిమ్మకాయను రెండు భాగాలుగా చేసి, దానిని పిండి, తిప్పి అక్కడ వచ్చిన గుంత లో కొద్దిగా ఆవునెయ్యి వేసి, దూదితో చేసిన ఒక వత్తి ని వేసి వెలిగించాలి. అలా రెండు దీపాలు వెలిగించి దుర్గా దేవికి సమర్పించాలి. తరువాత దుర్గా దేవి యొక్క దర్శనం చేసుకొని, గ్రహదోషాలు నివృత్తి చేయమని ప్రార్ధించి, ఆ తల్లికి ప్రసాదం(నైవేద్యం) సమర్పించి. వీలైతే కుంకుమ పూజ చేసుకొని ఇంటికి వెళ్లినా ఎలాంటి గ్రహ దోషాలు మిమ్ములను పీడించక అనేక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా ప్రతీ మంగళవారం, శుక్రవారం చేసినా త్వరలోనే మీ కోర్కెలు ఫలిస్తాయని ప్రతీతి. దీనిని ఎంతో మంది ఆచరించి సత్పలితాన్ని పొందారట. ఏ పని చేసినా పూర్తి భక్తి విశ్వాసాలతో చేస్తే తప్పక ఫలితం వస్తుంది. 

మీ విలువైన అభిప్రాయాన్ని క్రింది కామెంట్ లలో మాకు తెలియచేయప్రార్ధన. ఇలాంటి మరెన్నో విషయాలను నేరుగా మీ మెయిల్ ద్వారా చదవడానికి పైన ఉన్న subscribe అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మే ఈమెయిలు ఎంటర్ చేసి మీ మెయిల్ ఓపెన్ చేసి చూడండి ఒక కన్ఫర్మేషున్(confirmation) లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అంతే, ఇలాంటి అనేక విషయాలు మీ మెయిల్ కి ప్రతీ రోజు ఉచితంగా వస్తాయి. జై హింద్    

Comments