విచిత్రంగా చింతచెట్టు నుండి వచ్చిన శబ్దాలు – మహా విష్ణువు సాక్షాత్కారం – నేటి క్షేత్ర దర్శనంలో

పూర్వం ఒక ఉరిలో ఒకసారి దేవాలయం ఉన్న స్థలంలో ఉన్న ఒక పెద్ద చింతచెట్టు నుంచి అక్కడికి దగ్గర్లో ఉన్నవారికి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. వారు అక్కడికి వెళ్ళి చూడగా ఆ చెట్టు తొర్రలో ఒక విష్ణువు విగ్రహం కనిపించింది. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోట లో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కనబడి చింత చిట్ట తొర్రలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు.

ఈ ఆలయాన్ని ప్రౌఢరాయల కాలంలో తాడిపత్రిని పాలిస్తున్న పెమ్మసాని రామలింగనాయుడు, తిమ్మనాయుడులు 1510- 1525 మధ్యలో నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో వున్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాశి నుండి శిల్పులను రప్పించారు. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం చింతచెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, విగ్రహం చింతచెట్టు తొర్రలో దొరకడం వల్ల ఇక్కడి స్వామిని చింతల తిరువేంగళ నాథ స్వామి అని పిలిచే వారు. క్రమంగా చింతల వేంకటేశ్వర స్వామి లేదా చింతల వేంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు. కొంత శిథిలమైన కళ్యాణమంటపాన్ని క్రీ.శ.1800 ప్రాంతంలో అప్పటి కలెక్టర్ థామస్ మన్రో మరమ్మత్తులు చేయించి ప్రభుత్వ నిధులతో ఆలయ నిత్యపూజాదికాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాడు.

గర్భగుడిలోని మూల మూర్తి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించి వరుసగా మూడు రోజుల పాటు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి. ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న రాతి రథంలోని రంధ్రాల గుండా ప్రవేశించి స్వామివారి మీద పడేలా ఏర్పాటు చేశారు.

దేవాలయ మంటపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై ఉంది. గోడలపై, స్తంభాలపైన రామాయణ, మహాభారత గాథలను శిల్పాలుగా చెక్కి ఉన్నారు. నడవ పై కప్పు పైన అష్టభుజాకారాంలో పువ్వులు చెక్కి ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామ స్వామి ఆలయం, పద్మావతీ దేవి ఆలయం ఉన్నాయి.

అంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయమే చింతల వెంకటరమణ దేవాలయంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామంలో కొనియదబడుతుంది. 

ఇంతటి అద్భుతమైన ఈ క్షేత్ర మహిమను మీ మిత్రులకు కూడా తెలిసేలా లేదా మొరొక్కసారి గుర్తుచేసేలా అందరికి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలగురించి తెలుసుకునేందుకు పైన ఉన్న subscribe అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మే ఈమెయిలు ఎంటర్ చేసి మీ మెయిల్ ఓపెన్ చేసి చుడండి ఒక కన్ఫర్మేషున్ లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అంతే ఇలాంటి అనేక విషయాలు మీ మెయిల్ కి ప్రతీ రోజు ఉచితంగా వస్తాయి. జై హింద్    

Comments