ఈ మంత్రం జపం చేస్తే ఎలాంటి శత్రువైనా తిరిగి మీ శరణు కోరాల్సిందే.


ప్రస్తుత రోజులలో ప్రతీ ఒక్కరు జ్యోతిష్య పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో లేదో కానీ, శత్రు పీడా మాత్రం ప్రతీ ఒక్కరిని కలచివేస్తుంది. ఏపని మొదలుపెట్టిన ఆటంకాలు రావటం. ఎం జరుగుతుందో తెలియక పోవటం, శత్రువులు ఎవరో కూడా తెలియకుండా పోవటం. మన శత్రువులు మన పక్కనే ఉండి దెబ్బకొట్టడం లాంటి అనేక సమస్యలను నేటి సమాజంలో చాల మంది ఎదుర్కొంటున్నారు. కానీ వాటి నివృత్తికి ఎంతగా ప్రయత్నిచినా ఫలితం ఉండటంలేదు మల్లీ సరా మాములే అని చాలమంది చెప్తుంటారు. కాబట్టి అలంటి వారికీ అత్యద్భుతంగా  ఉపయోగపడే చక్కటి సులబతరమైన  మంత్రం ఇప్పుడు చెప్పబడుతుంది.

ఈ మంత్రాన్ని జపించే వారు ప్రతీ నిత్యం శ్రీ రామ మందిరాన్ని దర్శించి అక్కడ కూర్చుని రోజుకు కనీసం 108 సార్లకు తగ్గకుండా ప్రతీ నిత్యం జపం చేసినా వాళ్ళ శత్రువులు ఎంతటి వారైనా తిరిగి వాళ్ళ కాళ్ళ  దగ్గరకు రావలసిందేనట (శరణు కోరడానికి). అంతటి మహాద్భుతమైన ఈ మంత్రాన్ని ఎవరు జపిస్తారో వారికీ ఇలలోనూ,  కలలోను కూడా శత్రువు అనేటివారే ఉండరట. కాబట్టి, ఈ మంత్రాన్ని ధ్యానించేవారు వారి పూజామందిరంలో రాములవారి ఫటం పెట్టుకుని నిత్య పూజ చేసినా మరింత ఫలితం త్వరితగతిన పొందే అవకాశం ఉందట. ఇక మంత్రం చూద్దాం.

ఓం రామ పరుశురామా నృసింహ విష్షును విక్రమ నమో నమః


ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకొనేందుకు పైన భక్తి - శక్తీ పేరు కింద కనబడుతున్న subscribe అనే ఆప్షన్ పై క్లిక్ చేసి subscribe అవ్వండి(ఉచితం). ఈ పోస్ట్ ను షేర్ చేయటం ద్వారా మరింత మందికి సహాయపడండి.


శుభం భూయాత్

Comments