దుష్ట శక్తులు ఇంటిలో ప్రవేశించకుండా ఏం చేయాలి?


దుష్ట శక్తులు ఇంటిలో ప్రవేశించకుండా ఉండాలంటే మన శాస్త్రాలలో అనేక మార్గాలు చెప్పబడ్డాయి. వాటిలో కొన్ని ఈ పోస్ట్ లో చూద్దాం. అసలు ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకోవాలంటే వేరే పోస్ట్ లో ఎలా తెలుసుకోవచ్చో వివరాయించాము. చుడండి ఈ బ్లాగ్ లోనే.

మొదటగా ఇంటిలోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే.ఇంట్లో నీరంతరం ధూపం వేయాలి(పూజ చేసుకునేటప్పుడు సాంబ్రాణి వేస్తాం కదా. అదే) కానీ ఇలా ధూపం వేసేటపుడు సాధారణంగా మనం బొగ్గుల పైనా లేక కొబ్బరి పీచు పైనా వేస్తాం కానీ మంగళవారం నాడు అవుపిడకలపై సాంబ్రాణి వేసి ఇల్లంతా చూపించినా మంగళం కలుగుతుంది అంతే కాదు ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా తక్షణమే పోతాయి.

రెండవది ఇంటినేప్పూడూ శుచిగా, శుభ్రంగా ఉంచుకోవాలి(లక్ష్మీ ప్రదంగా).

మూడవది, ఇంటిలో నిత్యం దీపారాధన(పూజ) చేయటంద్వారా ఎలాంటి దుష్ట శక్తులు ఇంటిలోకి వచ్చే అవకాశమే లేదు.

నాల్గవది ఇంటి ఆవరణలో తులసి, నిమ్మ, దానిమ్మ లాంటి చెట్లను పెంచటం ద్వారా ఎలాంటి దుష్టశక్తులను రాకుండా ఆపవచ్చు.

అంతే కాకా హిందూ ధర్మం లో పవిత్ర గ్రంధాలైన పురాణాలు, రామాయణం మహాభారతం, భగవద్గీత లాంటివి ఉంచినా ఎలాంటి దుష్టశక్తులు దరిచేరవు.

ఇక యంత్ర రూపం లో చూస్తే, ఇంటికి ముందు బూతా ప్రేత నాశన యంత్రాన్ని కానీ రక్షణ యంత్రాన్ని ఉంచటం ద్వారా కానీ లేక ఇతర సంబంధిత యంత్రాన్ని ఉంచటం ద్వారా కానీ ఆపవచ్చు. కానీ ఆ యంత్రాన్ని అనుభవం ఉన్న పండితులు/వాస్తు, జ్యోతిషుల వారి దగ్గరనుండి తీసుకోవడం ఇంతేనా అవశ్యం. ఎందుకంటే బయట కొన్న యంత్రాలు (ప్రాణ ప్రతిష్ట చేసి, పూజించని యంత్రాలు) ఉంటాయి, అవి పనిచేయకపోవచ్చు. యంత్రాలు పనిచేస్తాయ అనే మరొక పోస్ట్ లో వీటి గురించి వివరించటం జరిగింది దానితో పాటు గ్రహాలకు సంబందించిన వివరాలు కూడా వేరే పోస్ట్ లో వివరించటం జరిగింది. వాటి కోసం మీరు ఈ బ్లాగ్ లోనే వెతకండి. దొరుకుతాయి.

ఇలాంటి మరిన్ని విలువైన విషయాలు తెలుస్కోవటానికి వెంటనే పైన కనబడుతున్న భక్తి – శక్తీ అనే పేరు కింద ఉన్న subscribe అనే option మీద క్లిక్ మీ email అడ్రస్ ని ఎంటర్ చేయండి (ఉచితం) అంతే ప్రతీ విషయం మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. అంతే కాదు మీకు ఎలాంటి సందేహం ఉన్నా (ఆద్యాత్మికత కు సంబంధించి) కింద కామెంట్ లో రాయండి. వెంటనే మీ ప్రశ్నకి సమాదానం తెలుపుతాము. ఉదా: మా మిత్రుడు అడిగాడు, ధర్మాత్ముడు అయిన కర్ణుడు ఎందుకు అన్ని కష్టాలను అనుభవిస్తాడు అని. దాని పై వెంటనే దానిపై ఈ బ్లాగ్ లో పోస్ట్ పెట్టి, ఆయనకు తెలియచేయటం జరిగింది

శుభం భూయాత్

Comments