సాధారణముగా ఇంటిలో పూజ చేసుకుంటేటపుడు పూజా మందిరంలో చాలామంది దేవుళ్ళ పఠాలు లేదా విగ్రహాలు ఉంటాయి. చాలామందికి ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నైవేద్యం పెట్టాలా? లేకా అందరికి ఒకే నైవేద్యం పెట్టొచ్చా అనే సందేహం కలుగుతుంది. అందులోనూ ప్రస్తుతం చాలా మంది చాలా విధాలుగా చెప్తున్నారు. అంటే ఈ రోజు ఇది నైవేద్యం పెడితే ఇది కలుగుతుంది లేదా ఈ దోషం పోతుంది అని అనేక రకాల పరిష్కారాలు చెప్తున్నారు. కానీ అందరికి అవి వీలు కాదు. కానప్పుడు ఎవరికీ ఏ నైవేద్యం పెట్టాలి అనే సందేహం కలుగుతుంది. అటువంటప్పుడు పూజ చేసేవారు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వారు పూజా మందిరంలో పూజ చేసుకుంటేటపుడు అందరి దేవతలకు ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని పెడితే సకల దేవతలకూ సంతోషమేనట. ఆ ప్రీతిపాత్రమైన నైవేద్యం ఏమిటంటే, పరవాన్నం. అవును పరవాన్నం సకల దేవతలకు ప్రీతీకరమైన నైవేద్యం అని హిందూ ధర్మ శాస్త్రాల్లో చెప్పారట. కాబట్టి, ఏ నైవేద్యం పెట్టాలి అని ఆలోచించే వాళ్ళు ఎలాంటి సందేహం లేకుండా పరవాణాన్ని నైవేద్యంగా పెడితే అందరు దేవతలు సంతోషిస్తారట. కాకపోతే నైవేద్యం ఎప్పుడు పెట్టినా వాటిపై నీళ్లు చల్లి కుడి చేత్తో ఐదు సార్లు దేవునికి చుపించాలట(ప్రాణ,అపాన,వ్యాన, ఉదాన,సమయ అని చెప్తారు కదా మంత్రాలతో . అదే అన్నమాట. అంటే మంత్రాలూ రాణి వాళ్ళు నైవేద్యం సమర్పయామి అని ఐదు సార్లు చూపిస్తే మంచిదట).
ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకొనేందుకు పైన భక్తి - శక్తీ పేరు కింద కనబడుతున్న subscribe అనే ఆప్షన్ పై క్లిక్ చేసి subscribe అవ్వండి(ఉచితం). ఈ పోస్ట్ ను షేర్ చేయటం ద్వారా మరింత మందికి సహాయపడండి.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి