నిద్రలేచాక మొట్టమొదటగా ఈ రెండు లైన్ ల శ్లోకం చదవండి. మీకంతా శుభమే జరుగుతుంది.


మన హిందూ ధర్మ శాస్త్రాలలో ప్రతీ పనిని శుభప్రదంగా ప్రారంభించటానికి, మొదలెట్టిన పనిని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేయడానికి అనేక పద్ధతులు, మంత్రాలూ చెప్పబడ్డాయి. వాటిలో భాగంగానే ఉదయం లేవగానే ఏ మంత్రం చదవాలి, దేవుణ్ణి ఎలా స్మరించాలి. రోజు ఎలా ప్రారంభించాలి. భోజనం చేసేముందు భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలి లాంటివి. కానీ అవి చాల మందికి తెలియక పఠించరు. కాబట్టి అందరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ పోస్ట్ లో నిద్ర లేచినవెంటనే ఏ శ్లోకం చదవాలో చూద్దాం.

హిందూ ధర్మం ప్రకారం నిద్రపోయేముందు, నిద్రలేచిన తర్వాతకూడా దేవుని స్మరించాలి అని చెప్తారు. ఆలా స్మరించటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట అన్నిటికంటే ముఖ్యమైనది మనకు ఈ జన్మ ఇచ్చిన దేవునికి కృతజ్ఞత తెలుపుతున్నట్టు దేవుణ్ణి నిరంతరం ప్రార్దిస్తాం. 

ఈ శ్లోకం యొక్క అర్ధం ఏమిటంటే హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, గౌరీదేవి మన అరచేతిలోనే ఉంటారట. కాబట్టి లేచిన వెంటనే ఏమి చూడాలి లేదా అరే ఈ రోజు లేచిన వెంటనే పలానాది చూసాను రోజు ఎలా ఉంటుందో ఏంటో అని అనుకోవాల్సి పనిలేదట. ఎందుకంటే అన్నిటికంటే పవిత్రమైన లేదా దేవతలు కొలువున్న మీ యొక్క రెండు అర చేతులు దగ్గరకు చేర్చి. కింది మంత్రాన్ని జపించండి చాలు ఆ మంత్రం బలానికి మీకు రోజంతా శుభం కలుగుతుంది.

మంత్రం:

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||

కాబట్టి ప్రతీ హిందువు నేటినుండి ప్రతీ రోజు నిద్రనుండి ఉపక్రమించినవెంటనే పైన తెలుపబడిన శ్లోకం చదివండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే పైన భక్తి - శక్తీ అనే పేరు కింద కనబడుతున్న subscribe అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ email అడ్రస్ ఎంటర్ చేయండి. అంతే ఎలాంటి విలువైన సమాచారం మీ మెయిల్ కి నేరుగా వచ్చేస్తుంది ఉచితంగా. ప్రతీ హిందువు subscribe చేసుకుంటారని ఆశిస్తున్నాము. జై హింద్ 

శుభం భూయాత్ 

Comments