ఈ క్షేత్రంలో ఉన్నట్టుగా శ్రీ రాముడు ఇంకెక్కడా ఉండరట- చాల ప్రత్యేకత కలిగిన క్షేత్రం.


ఎవరి నామ జపం వాళ్ళైతే జన్మ ధన్యం అవుతుందో, ఎవరి నామ స్మరణ వల్ల సర్వ పాపాలు నశిస్తాయో. ఆయనే శ్రీ రామచంద్రమూర్తి. అటువంటి శ్రీ రాముడు ఒకానొక్కప్పుడు తన వనవాస సమయంలో ఒక రాయి మీద కూర్చుంటాడట. తాను ఆ రాయి మీద కుర్చున్నందుకు గాను ఆ రాయికి తాను ఒక వరం ఇస్తాను అని ఆ రాయిని వరం కోరుకో అని అనగానే ఆ రాయి నువ్వు నామీదే శాశ్వతంగా ఉండాలి అని అది కూడా శంఖచక్రాలతో ఉండాలి అని అంటుందట. అప్పుడు శ్రీరాముడు సరే, నువ్వు మేరుపర్వత పుత్రుడు బద్రుడిగా జన్మిస్తావు అప్పుడు నేను నీమీద వెలుస్తాను అని వరం ఇస్తాడట. సాధారణంగా శ్రీరాముడు ఇక్కడ ఉన్నట్టుగా ఎక్కడ ఉండదు. ఎందుకంటే భద్రునికి ఇచ్చిన వరం మేరకు ఇక్కడ శ్రీ రాముడు శంఖచక్రాలతో ఉంటాడు. అంతటి ప్రత్యేకత గల ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో భద్రాచలం అనే గ్రామం లో కలదు. ఈ స్వామిని పూజించిన, దర్శించినా ఎంతో పుణ్యం లభిస్తుందట. ఇప్పటికీ శ్రీ రాముడు, సీతాదేవి నడయాడిన ప్రదేశాలు, వాటి జాడలు అక్కడే ఉన్నాయట. అక్కడకు వెళ్లిన భక్తులు వాటిని సందర్శించి భక్తి శ్రద్దలతో పూజించి, తరిస్తారట.
జై శ్రీ రామ్.

ఇటువంటి అనేక విశేషాలు తెలుసుకునేందుకు వెంటనే పైన భక్తి-శక్తీ అనే పేరు కింద ఉన్న subcribe  అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, మీ ఇమెయిల్ అడ్రస్ రాసి subscribe  చేసుకోండి (ఉచితంగా). మీకు ఎలాంటి సందేహం ఉన్న క్రింద కామెంట్స్ లలో రాయండి. అలాగే ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాన్ని చెప్పటం మర్చిపోకండి(కింద కామెంట్స్ లో రాయండి)  జై హింద్.

Comments