చాలామంది వివాహం అవ్వటం లేదని బాధపడుతుంటారు. సాధారణంగా వివాహం కాకపోవడానికి జ్యోతిష్యం ప్రకారం అనేక కారణాలు ఉంటాయి. అంటే కాలసర్పదోషం, కుజ దోషం లాంటివి అన్నమాట. చాల మందికి అసలు ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా తెలీదూ. జ్యోతిష్యులు చూపించినపుడు కొన్ని కొన్ని సార్లు అసలైన సమస్య చెప్పకపోవచ్చు. ఉందాహరణకు కొంత మంది జాతకంలో అనేక సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు కాలసర్పదోషం, కుజ దోషం, ఏలినాటి శని లాంటివి ఒకే జాతకం లో ఉన్నాయనుకోండి. అప్పుడు వాటిలో దేన్నొకదాన్ని చెప్పటం మరిచిపోవచ్చు లేక ముందుగా ఏలినాటి శని ఉంది కాబట్టి దానికి పరిహారాలు చేయించి తరువాత మిగిలినవి చూద్దాం అని నిర్లక్ష్యం చేయవచ్చు. అటువంటి సమయంలో సమస్య ఎక్కడుంతో తెలీదు కానీ దాని యొక్క ప్రభావం మాత్రం అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక రకాల కారణాలతో చాలామంది వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కానీ క్రింద ఇవ్వబడిన పరిహారం చేస్తే చాల చక్కగా ఉపకరిస్తుంది.
ప్రతీ మంగళవారం(కనీసం ఎనిమిది మంగళవారాలు) హనుమాన్ గుడికి వెళ్లి 108 తమలపాకులతో ఆయనకు భక్తి శ్రద్ధలతో పూజించి(అర్చన) నమస్కరించిన మీ సమస్య తీరగలదు.
అలాగే శని వళ్ళ వివాహం ఆలస్యం అవుతుంటే ప్రతి శనివారం చీమలకు (నల్ల చీమలకు) తేనెని పెట్టడం ద్వారా దోషం తగ్గుతుంది.
ఏదొక కారణంగా వివాహం ఆగిపోతుంటే క్రింద ఇచ్చిన మంత్రాన్ని ప్రతీ నిత్యం జపించినా చక్కట్టి ఫలితం ఉంటుంది.
ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే
ఈ మంత్రాన్ని కనీసం 21 రోజులు, రోజుకి 108 సార్లకు తక్కువ కాకుండా జపించినా, దోషాలు తొలగిపోతాయి.
త్వరలో హిందువులకు నిర్వహించబోయే లక్కీ డ్రా లో పాల్గొని విలువైన బహుమతులు గెలుపొందాలంటే ఇప్పుడే పైన భక్తి శక్తీ అనే పేరు కింద కనబడుతున్న subscribe అనే పేరు/ఆప్షన్ పై క్లిక్ చేసి ఉచితంగా subscribe అవ్వండి. మీరుచేయవలసిందల్లా subscribe మీద నొక్కి మీ ఇమెయిల్ అడ్రస్ ఇవ్వడమే. జై హింద్.
మీకు ఎలాంటి సందేహం ఉన్నా కింద కామెంట్స్ లో రాయండి.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి