ఎవరు ఏ లింగాన్ని పూజిస్తే సరైన ఫలితం వస్తుంది.?


శివలింగాలలో అనేకరకాల ఉన్నాయట. ఒక్కొక్కోడానికి ఒక్కొక్క విశేషం ఉందట. అంతేకాదు. ఒక్కొక్క లింగాన్ని పూజించటం ద్వారా ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుందట. అంటే ఎవరు ఎలాంటి లింగాన్ని పూజించాలి అనేది వారి యొక్క కోరికను బట్టి లేదా వారి యొక్క వృత్తిని బట్టి ఉంటుందని చెప్పవచ్చు. ఉదాహరణకు బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, క్షత్రియులు బాణలింగాన్ని, వ్యాపారస్తులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలా లింగాన్ని పూజించాలి. వితంతువులు స్ఫటికలింగాన్ని లేక రసలిం గాన్ని అర్చిస్తే మంచిది. ఈ స్ఫటికలింగాన్ని అందరూ పూజించవచ్చు. 

ఏ లింగాన్ని పూజించడం వల్ల ఫలితమన్న విషయాన్ని లింగపురాణం వివరించింది.

1. గంధలింగం: రెండు భాగాలు కస్తూరి, నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.
2. పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
3. గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారుచేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భూమిపెై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.
4. రజోమయలింగం: పుప్పాడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివసాయుజ్యాన్ని పొందగలం.
5. ధాన్యలింగం: యవుల, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.
6. తిలపిష్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.
7. లవణజలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.
8. తుషోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.
9. భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగుజేస్తుంది.
10. శర్కరామయలింగం: సుఖప్రదం.
11. సద్యోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.
12. వంశాకురమయలింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.
13. కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.
14. పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
15. దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.
16. ఫలోత్థలింగం: ఫలప్రదమైనది.
17. ధాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.
18. నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
19. దుర్వాకాండజలింగం: గరికతో తయారు చేసిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.
20. కర్పూరజ లింగం: ముక్తిప్రదమైనది.
21. ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.
22. సువర్ణనిర్మిత లింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.
23. రజత లింగం: సంపదలను కలిగిస్తుంది.
24. ఇత్తడి-కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.
25. ఇనుము-సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.
26. అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.
27. వెైఢూర్యలింగం: శత్రునాశనం. దృష్టిదోషహరం.
28. స్ఫటికలింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.
29. సితాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.

ఇక శివలింగాలు లక్షణ శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి రెండు విధాలుగా ఉన్నాయి.
1. శుద్ధలింగమూర్తులు, 2. లింగోద్భవమూర్తులు
శుద్ధలింగాలు స్థావర లింగాలు, జంగమలింగాలని రెండు విధాలుగా ఉన్నాయి.
మానుషమూర్తులు 1. అనుగ్రహమూర్తులు, 2. సంహార మూర్తులు, 3. నృత్యమూర్తులు, 4. ఉమాసహిత మూర్తులు, 5. ఇతర మూర్తులని ఐదు రకాలుగా ఉన్నాయి.
స్థావరలింగాలు 1. స్వాయంభువలింగాలు, 2. పూర్వపురాణలింగాలు, 3. దెైవతలింగాలు, 4. గాణపత్యలింగాలు, 5. అసురలింగాలు, 6. సురలింగాలు, 7. ఆర్షలింగాలు, 8. మానుషలింగాలు, 9. బాణలింగాలని తొమ్మిది విధాలుగా ఉన్నాయి.
కామికాగమంలో శివలింగాలు నాలుగు రకాలుగా చెప్పబడ్డాయి. 1. స్వయంభులింగాలు, 2. దెైవత, గాణపత్య లింగాలు, 3. అసుర, సుర, ఆర్షలింగాలు, 4. మానుషలింగాలు.

శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచంఢమైన ఊర్జస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపెై పడకుండా ఉండేందకు శివలింగంపెై జలధారను పోస్తుండాలి. ఆ దార నుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు.

ఇలాంటి అనేక విశేషాలు తెలుసుకోవటానికి వెంటనే పైన "భక్తి - శక్తీ" అనే పేరు కింద కనబడుతున్న subscribe మీద క్లిక్ చేసి మీ email ఎంటర్ చేయండి. ఎలాంటి అనేక విశేషాలు మీకు నేరుగా పంపబడతాయి (ఉచితంగా). మీకు ఎలాంటి సందేహం ఉన్న ఈ కింద కామెంట్ లలో రాయవచ్చు. అలాగే మిసలహాలు కూడా ఇవ్వవచ్చు. ధన్యవాదాలు

శుభం భూయాత్ 

Source of information: Friend Messaged.


Comments