ఈ ఒక్క శ్లోకాన్ని త్రికాలమందు పఠించి- లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల కుబేర సమానులు అవ్వండి.


అవును. ఇది మేము చెప్పిన విషయం కాదు. మన ధర్మం చెప్పిన విషయం. ఎవరైతే లక్ష్మి దేవి యొక్క కనకధారా స్తోత్రాన్ని త్రికాలమందు పఠిస్తారో, వారు కుబేరునితో సమానమగు ధనవంతులు కాగలరట.

క్లుప్తంగా ఒక చిన్న వివరణ:
ఇంతటి ఈ పవిత్రమైన, అత్యంత విలువైన ఈ స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు ఎనిమదవ శతాబ్దంలో రచించారట. ఇదీ కథ:

ఒక నాడు, శంకరాచార్య బిక్షాటనకై బయలుదేరి వెళ్తున్న సమయంలో ఒక పేద బ్రాహ్మణ స్త్రీ యొక్క గృహాన్ని చేరుకుంటాడు. భిక్షతనకు వచ్చిన వారిని చూసి ఆ పేద బ్రాహ్మణా స్త్రీ అతనికి ఇవ్వటానికి ఏమి లేవు అని దుఃఖించి, ఇల్లు అంతా వెతకగా ఒక ఫలం కనబడుతుంది. అది తెచ్చి ఆయనకి దానం ఇస్తుంది. ఇది చూసిన శంకరాచార్య, ఆమె యొక్క బాధలను గ్రహించిన తాను మొత్తం 21 శ్లోకాలతో ఒక స్తోత్రాన్ని పఠించి, లక్ష్మి దేవిని ప్రార్థిస్తాడు. అతడి ప్రార్థన విన్న లక్ష్మి దేవి ప్రత్యక్షమై ఏమి అని అడుగగా, ఆయన లక్ష్మి దేవికి ఆ పేద బ్రాహ్మణ స్త్రీ పై అనుగ్రహహించమని(సంపదనివ్వమని), ఆవిడ యొక్క బాధలను తొలగించమని ప్రార్థిస్తాడు.   

అతని ప్రార్థన వినిన, లక్ష్మి దేవి ఇలా పలికింది, నాయన ఆ బ్రాహ్మణ స్త్రీ పూర్వ జన్మలలో ఎవరికీ దానం చేయలేదు, ఎంతో కర్మ చేసుకుంది. ఆ కర్మ యొక్క ఫలితాన్నే ఇప్పుడు అనుభవిస్తుంది అని చెప్పగా. దానికి అతను, మాతా ఈ బ్రాహ్మణ స్త్రీ తన యొక్క గృహంలో దానం ఇవ్వటానికి ఏమి లేకున్నను ఒకే ఒక్క ఫలం ఉండటం చూసి, అది నాకు దానంగా ఇచ్చినది. కావున ఈ ఒక్క కారణం చేత ఆవిడకు ఈ కష్టాలను తొలగించి, ఐశ్వర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు.

శంకరాచార్య మాటలు వినిన లక్ష్మి దేవి సంతోషించి, ఏ ఫలాన్నైతే సంకరాచార్యలకు దానంగా ఇచ్చిందో అలాంటి ఫలాలని బంగారు ఫలాలుగా ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ ఇంటిలో కురిపిస్తుంది.

కావున, ఎవరైతే భక్తితో శంకరాచార్యులు రాసిన ఈ యొక్క కనకధారా స్తోత్రాన్ని పఠిస్తారో, వారికీ ఎటువంటి కష్టాలు ఉండవు. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ సౌలభ్యం కొరకు శంకరాచార్య విరచిత శ్రీ కనకధారా స్తోత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 


వందే వందారు మందార మింది రానంద కందలం, అమందానంద సందోహ బంధురం సింధురాననమ్


అంగం హరేః పులక భూషణ మాశ్రయంతీ, 
బృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |

అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా, 
మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః || 1 ||

ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః , 
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని |

మాలాదృశో ర్మధుకరీవ మహోత్పలే యా, 
సా మే శ్రియం దిశతు సాగర సంభావా యాః || 2 ||

విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్ష, 
మానంద హేతు రధికం మురవిద్విషోపి |

ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థం, 
ఇందీవరోదర సహోదర మిందియా యాః || 3 ||

ఆమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుంద, 
మానంద కంద మనిషేష మనంగ నేత్రమ్ |

అకేకర స్థిత కనీనిక పద్మనేత్రం, 
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః || 4 ||

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా, 
హారావళీవ హరినీలమయీ విభాతి |

కామప్రదా భగవతో‌உపి కటాక్షమాలా, 
కళ్యాణ మావహతు మే కమలాలయా యాః || 5 ||

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః, 
దారాధరే స్ఫురతి యా తటిదంగ నేవ |

మాతస్సమస్త జగతాం మహనీయమూర్తిః, 
భద్రాణి మే దిశతు భార్గవ నందనా యాః || 6 ||

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్, 
మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన |

మయ్యపతే త్తదిహ మంథర మీక్షణార్థం, 
మందాలసం చ మకరాలయ కన్యకా యాః || 7 ||

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబు ధారా, 
మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే |

దుష్మర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం, 
నారాయణ ప్రణయినీ నయనాంబు వాహః || 8 ||

ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర, 
దృష్ట్యా త్రివిష్ట పపదం సులభం లభంతే |

దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం, 
పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః || 9 ||

గీర్ధవ తేతి గరుడద్వజ సుందరీతి, 
శాకంభరీతి శశశేఖర వల్లభేతి |

సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై, 
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై || 10 ||

శ్రుత్యై నమో‌உస్తు శుభకర్మ ఫలప్రశూత్యే, 
రత్యై నమో‌உస్తు రమణీయ గుణార్ణవాయై |

శక్త్యై నమో‌உస్తు శతపత్ర నికేతనాయై, 
పుష్ట్యై నమో‌உస్తు పురుషోత్తమ వల్లభాయై || 11 ||

నమో‌உస్తు నాళీక నిభాననాయై, 
నమో‌உస్తు దుగ్దోదధి జన్మభూమ్యై |

నమో‌உస్తు సోమామృత సోదరాయై, 
నమో‌உస్తు నారాయణ వల్లభాయై || 12 ||

నమో‌உస్తు హేమాంబుజ పీఠికాయై, 
నమో‌உస్తు భూమండల నాయికాయై |

నమో‌உస్తు దేవాది దయా పరాయై, 
నమో‌உస్తు శారంగాయుధ వల్లభాయై || 13 ||

నమో‌உస్తు కాన్యై కమలేక్షణాయై, 
నమో‌உస్తు భూత్యై భువన ప్రసూత్యై |

నమో‌உస్తు దేవాదిభి రర్చితాయై, 
నమో‌உస్తు నందాత్మజ వల్లభాయై || 14 ||

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, 
సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి |

త్వద్వందనాని దురితాహరణోద్యతాని, 
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 15 ||

యత్కటాక్ష సముపాసనా విధిః, 
సేవకస్య సకలర్థ సంపదః |

సంతనోతి వచనాంగ మానసైః ,
త్వాం మురారి హృదయేశ్వరీం భజే || 16 ||

సరసిజనిలయే సరోజహస్తే, 
దవళ తమాంశుక గంధమాల్య శోభే |

భగవతి హరివల్లభే మనోఙ్ఞే,
త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్ || 17 ||

దిగ్ఘస్తభిః కనక కుంభముఖావ సృష్ట, 
స్వర్వాహినీ విమలచారు జల ప్లుతాంగీమ్ |

ప్రాతర్నమామి జగతాం జననీ మశేష, 
లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రీమ్ || 18 ||

కమలే కమలాక్ష వల్లభే త్వం, 
కరుణాపూర తరంగితై రపాంగైః |

అవలోకయ మా మకించనానం, 
ప్రథమం పాత్ర మకృతిమం దయాయాః || 19 ||

స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం,
త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్ |

గుణాధికా గురుతుర భాగ్య భాజినో, 
భవంతి తే భువి బుధ భావితాశయాః || 20 ||

సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్


ఇలాంటి అనేక విశేషాలు తెలుసుకోవడానికి మా బ్లాగ్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి. ఫాలో కూడా అవ్వొచ్చు. అంతే కాకుండా మీకు ఎలాంటి సందేహం ఉన్నా (మన గ్రంధాలకు సంబంధించి) లేదా మీ యొక్క జాతక వివరాలను లేదా మీ జ్యోతిష, గ్రహ, కాలసర్ప, కుజ దోష, వాస్తు దోష లాంటివాటికి సంబందించిన ఎలాంటి సమసిక్యనా మమ్ములను ఈ బ్లాగ్ లో ఇవ్వబడిన కాంటాక్ట్ ఫార్మ్ ద్వారా సంప్రదించగలరు. 

శుభం భూయాత్

Comments