పూర్వం రాక్షస రాజైన రావణుడు తన శక్తి తో నవగ్రహాలను తన కాలితో తొక్కి పెడతాడు. (రావణుడు కూడా గొప్ప శక్తివంతుడు, జ్యోతిష్యం తెలిసినవాడు, గొప్ప వరం పొందినవాడు). రావణుడు తన కుమారుడు అయిన ఇంద్రజిత్ జనన సమయంలో ఏ ఒక్క గ్రహం కూడా ప్రతికూలంగా ఉండకుండా అన్ని గ్రహాలు మంచి పోసిషన్ (స్థానాల్లో) ఉండేలా చేస్తాడు. అది తెలుసుకున్న దేవతలు నవగ్రహాలకు సహాయం కోసం ప్రార్ధించగా, వారు ఈ నిస్సహాయక స్థితిలో ఏమి చేయలేము అన్నట్టుగా చెప్పితే అందులో శని, నన్ను పైకి తిప్పేలా చేయండి. నా చూపు రావణుడి పై పడిన మీ సమస్యకు పరిష్కారం దొరకగలడు అని చెప్తాడు. ఈ కార్యార్థమై దేవతలు నారద మహర్షి సహాయం తీసుకొంటారు.
అప్పుడు నారదమహర్షి, రావణుని దగ్గరకు వచ్చి, నవగ్రహాలను తొక్కి పెట్టి ఉన్న రావణుని చూసి, రావణుని యొక్క కీర్తిని ప్రశంసించి (పొగిడి), రావణునితో ఇలా అంటాడు. రవాణా నవగ్రహాలను పడుకో పెట్టి వారి వీపుపై తొక్కటం కాదు. వారి ఛాతి పై తొక్కిన్నప్పుడు కదా నీ అసలైన శక్తీ, ప్రతిభా, విజయం తెలిసేది. అని అంటాడు. అది విన్న రావణుడు. నిజమే ! అని వెంటనే నవగ్రహాలను తిప్పి వారి ఛాతి పై కాలు వేసి తొక్కుతాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు పైకి తిరిగాయో. అప్పుడు శని గ్రహం చూపు రావణుడి పై పడుతుంది. వెంటనే రావణుడికి కష్టాలు ప్రారంభం అవుతాయి. జ్యోతిష్యంలో గొప్ప ప్రావీణ్యుడైన రావణుడు తన కష్టాలకు శని చూపు సోకడమే అని గ్రహించి. వెంటనే శని ని శని చూపు కూడా బయిటకు రాని అంతటి దట్టమైన చీకటి గల గుహలో బంధిస్తాడు.
చాలా కలం తర్వాత రాముడి ఆజ్ఞ నెరవేర్చటానికి, సీతను కలవటానికి హనుమంతుడు, రావణ లంకకు వస్తాడు. ఆలా వచ్చిన సమయంలో హనుమంతుడికి, శని యొక్క ఆర్థనాదాలు వినబడి. వెంటనే ఆ రాళ్లను పగలగొట్టి శనిని బయటకు తీస్తాడు. శని దానికి సంతోషించి హనుమంతునికి ధన్యవాదాలు తెలిపి ఇలా అంటాడు. హనుమా నన్ను రక్షించిన నీకు కృతజ్ఞతలు, కానీ నన్ను రక్షించే సమయంలో నా చూపు నీపై పడింది కాబట్టి నువ్వు కష్టాలను ఎదుర్కోవలసివస్తుంది అని చెప్తాడు. అప్పుడు హనుమా వివరంగా చెప్పమని అడిగిన తర్వాత శని ఇలా చెప్తాడు. నేను ముందుగా నీ నెత్తిపై కూర్చున్నపుడు నువ్వు నీ భార్య బిడ్డలకు, గృహానికి దూరమై కష్టాలు పడతావు అని చెప్తాడు. అది విన్న హనుమంతుడు. నాకు నాకు పెళ్లి లేదు, సంసారమే లేదు, గృహం లేదు. శ్రీరాముని పాదాలవద్దే నా నివాసం(నేను అక్కడే ఉంటాను గృహం లేదు అని) అని, సరే రా న పై కూర్చో అని అంటాడు. శని దేవుడు అన్నట్టుగానే హనుమ నెత్తి పై కూర్చుంటాడు. అటుపిమ్మట లంకకు వచ్చిన హనుమ, రాక్షసులతో యుద్ధం చేస్తాడు.
ఆ యుద్ధం లో రాక్షసులు విసిరిన చెట్లను, రాళ్లను, తన తల తో బద్దలు గొడతాడు. ఈ ప్రక్రియలో హనుమంతుని తలమీద ఉన్న శనికి తీవ్ర గాయాలు అయ్యి, తట్టుకోలేక హనుమంతుని తలపైనుండి కిందకు దూకేస్తాడు. అప్పుడు శని హనుమంతునితో, శని ప్రభావం నుంచి ఇప్పటివరకు ఎవరు తప్పించుకోలేదు నువ్వు తప్ప అని చెప్పి. నన్ను కాపాడినందుకుగాను నీకు వరం ఇస్తాను కోరుకోమని అడుగుతాడు. అప్పుడు హనుమంతుండు. నా భక్తులైన ఎవరూ కూడా నీ వల్ల బాధపడకూడదు అని అడుగుతాడు. అప్పుడు శని భగవానుడు, సరే నావల్ల నీ భక్తులకు ఎలాంటి కష్టం రాజాలదు అని వరమిస్తాడు. అందుకే ఎవరైతే హనుమంతున్ని పూజిస్తారో, ప్రార్దిస్తారో వారికి శని వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. శని వల్ల బాధపడేవారు హనుమంతున్ని ఎలా ప్రార్దించాలో వేరొక పోస్ట్ లో ఈ బ్లాగ్ లోనే ఇవ్వటం జరిగింది. దానితో పాటు అనేక పరిష్కారాలు కూడా ఈ బ్లాగ్ లోనే పొందుపరచటం జరిగింది. కావున తామెల్లరు ఈ బ్లాగ్ కు సబ్స్క్రయిబ్ చేసుకుని సమస్త గ్రహ దోషాలు, జాతకదోషాల నుండి విముక్తికి/ఉపశమనానికి పరిహారాలు తెలుసుకొని, పాటించి ఆనందంగా జీవించగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఈ బ్లాగ్ లో విసిగించే ప్రకటనలు లాంటివి ఏమీ ఉండవు. ఇది ఒక ఆధ్యాత్మిక బ్లాగ్. ప్రతి హిందూవు subscribe చేసుకోగలిగింది, follow గలిగింది.
గమనిక : మీకు ఎలాంటి సందేహం ఉన్నా (జాతక, గ్రహ, కాలసర్ప, కుజ, ఇత్యాది ఎలాంటి వాటికైనా) ఈ బ్లాగ్ లో ఉన్న కాంటాక్ట్ ఫార్మ్ లో వివరాలను మాకు పంపగలరు. మీకు రిప్లై రూపంలో సహాయం అందించటానికి ప్రయత్నిస్తాము.
మీ జాతకం తెలియకపోతే, తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్య/ప్రశ్నను బట్టి దానికి సంబందించినవారు మీకు ఫోన్ చేసి మాట్లాడెదరు.
hi
ReplyDelete