అందరికి రామసేతు గురించి సమాచారం......
రామసేతు అనేది దక్షిణ భారత దేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైన రామేశ్వరం (పంబన్) ద్వీపానికి , మరియు శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ (Mannar) ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక దిబ్బ (Shoal/Sandbar). ఈ దిబ్బ ముఖ్యంగా ఇసుక, మరియు సున్నపు రాళ్ళను కలిగియుంటుంది. హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల సుమారు 1.2 మీటర్ల లోతులో మునిగియుండే ఈ ఇసుక దిబ్బ పొడవు 18 మైళ్ళు (అనగా 30 కిలోమీటర్లు). ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రామసేతుని ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జి (Adam’s Bridge) గా అభివర్ణించారు.
కవి వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రకారం శ్రీరాముడు వానర సైన్యంతో ఈ వంతెన నిర్మింపజేసాడు. ఈ వారధిని పలురకాల చెట్ల కాండాలతోను, రాళ్ళతోను నిర్మించారు. ఆ విధంగా వానరులసహాయంతో లంకకు వారధి నిర్మించడం, రావణుని సంహరించడం జరిగింది. కనుక రాముడే ఈ వారధిని నిర్మించాడు, అందుకే దీనిని రామసేతు అంటారు.!!
యుద్ధకాండ 22:66-70 ప్రకారం వానరులు మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాల్గవ రోజు 22 యోజనాలు, ఐదవరోజు 23 యోజనాలు – మొత్తం 100 యోజనాలు శ్రీలంక గట్టువరకూ నిర్మించి చివరకు లంక ఒడ్డుకు చేరారు..
అనగా 5 రోజుల్లో నిర్మించిన రామ సేతువంతెన పొడవు 14+20+21+ 22+23 = 100 యోజనాలు . యోజనము అనగా 3 మైళ్ళు. అనగా ఐదు రోజుల్లో 100×3= 300 మైళ్ళు నిర్మించడం జరిగింది ; మైలు అనగా 1.6 కిలో మీటర్లు, అనగా వానరులు 5 రోజుల్లో 300×1.6=480 కిలోమీటర్ల వంతెన కట్టడం అతిశయోక్తి అని, రామసేతు అసలైన పొడవు కేవలం 30 కిలోమీటర్లు అయితే 480 కిలోమీటర్లు ఎలా సాధ్యం అయ్యిందని, అసలు 5 రోజుల్లో కనీసం 30 కిలోమీటర్ల వంతెన కూడా నిర్మించడం అసంభవమని వాదించేవారు లేకపోలేదు . లంక అనగా సముద్ర తీర ప్రాంతము లేక చిన్న ద్వీపము.
రామాయణం ప్రకారం లంకా ద్వీపం భారత దేశానికి 480 కిలోమీటర్లు (100 యోజనాలు) దూరంలో ఉన్నది. కాని నేటి వాస్తవాన్ని పరిశీలిస్తే భారత దేశం నుండి శ్రీలంక కేవలం 30 నుండి 60 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది. భూమి పై మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టం పెరిగి రెండు ప్రదేశాల మధ్య దూరం పెరుగుతుందే గాని తగ్గదు. కనుక రామయణంలో పేర్కొనబడిన లంక అనగా వాస్తవంగా శ్రీలంక అని అనుకోవక్కర్లేదని వాదించేవారు లేకపోలేదు. “దైవసంభూతుడైన శ్రీరాముడు చివరకు వానరుల మీద ఎందుకు ఆధారపడవలసి వచ్చింది? నేరుగా శ్రీరాముడే పడవమీద లంకకు వెళ్ళొచ్చు కదా? లేదా హనుమంతుడి వీపు మీదే వెళ్ళొచ్చు కదా? వాల్మీకి మహర్షి బ్రతుకు తెరువు కోసం ఉత్తరం నుండి దక్షిణానికి వలస వస్తూ మార్గ మధ్యంలో తన రామాయణ కావ్యాన్ని వ్రాసుకుంటూ, ఆఖరిగా రామేశ్వరానికి వచ్చి అక్కడ యుద్ధకాండ ఊహించుకొని వ్రాసివుంటాడని, తర్వాత అక్కడే లేదా లంకలోనే తనువుచాలించాడని ” కొంతమంది విష్లేషకుల వాదన.
అలా చేస్తే సమస్తానికి నేడు రామసేతు అనే అతిపూర్వ కట్టడం మనం చూసే వారం కాదు కనుక అంత మంది వరనులు రాలేరు కనుక తప్పక వారది నిర్మించవలసి వచ్చింది
వికిపీడియా నుండి చూస్తే కొందరు వితండవాదం వేసేవారు
ఇలా వాదిస్తుంటారు
ఇన్ని లక్షల సంవస్తరాలలో నీటి శాతం పెరిగిపోవడం వాళ్ళ మనకు శ్రీ లంక ఇంట దగ్గరలోకి వచ్చింది చరిత్ర గమనిస్తే భూమి శతం తగ్గుతూనే వచ్చిందే తప్ప ఏ నాడు పెరగలేదు
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి