శివలింగాలు ఎన్ని రకాలో మీకు తెలుసా ? తెలుసుకుని పూజించండి




ఎవరూ ప్రతిస్తేపించాకుడా దానంతట అదే వచినదాన్ని స్వయంభూలింగం అంటారు . ధ్యానపూర్వకమైనది బిందు లింగం. మంత్రపూర్వకమైనది ప్రతిష్ఠాలింగం. నాలుగవది చర లింగం. ఐదవది శివుని విగ్రహమైన గురులింగం.

ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం. ఏకముఖలిం గం, ద్విముఖలింగం, త్రిముఖలింగం, చతుర్ముఖలింగం, పంచ ముఖలింగం, షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడ వచ్చు. అయితే ఆరుముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు. ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు, పరంలో శివసాయుజ్యం లభిస్తుందని పురాణవచనం.

ఏకముఖ లింగం:
ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుం టాం. తూర్పుముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపురంగులో పరమ శాంతంగా గోచరిస్తుంటుంది. సాధారణంగా ఈ లింగాలు శివ ఆలయాలలో నెైరుతిదిక్కులో ఉంటాయి. పదోన్నతి, అష్టైశ్వర్యాలను కోరుకునే భక్తులు, ఈ తత్పురుష లింగపూజలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు. అలాగే ఈ ఏకముఖ లింగాలకు ఏక ముఖ రుద్రాక్షలతో 11-121 సంఖ్యలో మాలలను తయారుచేసి, లింగమూర్తికి అలంకరించి బిల్వదళాలతో పూజిస్తే మానసికశాంతి.

ద్విముఖలింగం:
శివలింగానికి తూర్పు- పడమరల లో ముఖా లు కలిగి ఉండటం ద్విముఖలింగ లక్షణం. తూర్పుముఖం తుత్పురుష, పడమటి ముఖం సద్యోజాతం. వీరశెైవులు ఈ లింగాన్ని పూజిస్తుంటారు. ద్విముఖలింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏరర్రచాలన్నది నియమం. ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి. ఈ లింగాలను ఆలయాలలో చూడలేము.

త్రిముఖ లింగం:
ఈ శివలింగం తూర్పు, ఉత్తర, దక్షిణముఖాలను కలిగి ఉంటుంది. తూర్పున ఉన్న తత్పురుష ముఖం చిరునగవుతో, దక్షిణవెైపుగానున్న అఘోరముఖం కోపంతో, ఉత్తరం వెైపునున్న వామదేవముఖం మందహాసంతో గోచరిస్తుంటాయి. ఈ త్రిముఖలింగం సృష్టి, స్థితి, లయకారకులెైన త్రిమూర్తులను సూచిస్తోందని కొందరి భావన, మంత్రార్చనతో, త్రిముఖ రుద్రాక్షమాలను స్వామికి సమర్చించుకుని, మూడు దళాల బిల్వ పత్రాలతో అర్చిస్తే సకల సంపదలు సమకూరుతాయి.

చతుర్ముఖ లింగం:
నాలుగు ముఖాల ఈ లింగానికి తూర్పున తత్పురుషం, పడమట సద్యోజాతం, ఉత్తరాన వామదేవం, దక్షిణాన అఘోర ముఖాలున్నాయి. ఈ నాలుగుముఖాలను నాలుగు వేదమంత్రాలతో పూజిస్తుంటారు. ఈ లింగాన్ని చతుర్ముఖ రుద్రాక్షలతో అలంకరించి బిల్వపత్ర పూజ చేస్తే, అలా పూజించిన వారి మేధస్సు పెరుగుతుందనేది ఐతిహ్యం.

పంచముఖలింగం:
ఈ పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుం టాయి. నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో, తూర్పువెై పున ఐదవముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివ లింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. పంచముఖ రుద్రాక్ష మాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకిం చి, బిల్వ పత్రాలతో అర్చించి, ఐదు విధాలెైన ఉపచారాలను చేసి, పంచ నెైవేద్యాలను నివేధించాలి. ఈ ఐదు ముఖాల నుంచి ఆగమాలు వెలువడినందువల్ల దీనిని ‘శివాగమ లింగం’ అని కూడా పిలుస్తారు.

పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. నాలుగు దిక్కుల లో నాలుగు ముఖాలతో, తూర్పువెై పున ఐదవ ము ఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తు తం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివ లింగాలను ప్రతిష్ఠించుకుంటు న్నారు. పంచముఖ రుద్రాక్ష మాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకిం చి, బిల్వ పత్రాలతో అర్చించి, ఐదు విధాలెైన ఉపచారాల ను చేసి, పంచ నెైవేద్యాలను నివేధించాలి.

షణ్ముఖ లింగం:
ఈ లింగంలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుండగా, ఐదవ ముఖం ఆకాశాన్నీ, ఆరవముఖం పాతా ళాన్ని చూస్తుంటాయి. ఈ ఆరు ముఖాల నుంచి వెలువడిన తేజఃపుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామిని సృజించా డని పురాణకథనం. అలాగే పాలసముద్రాన్ని మధించినప్పు డు వెలువడిన హాలాహలాన్ని శివపరమాత్మ అథోముఖంతో స్వీకరించాడట అయితే ప్రస్తుతం ఎక్కడా మనం షణ్ముఖలిం గాన్ని దర్శించుకోలేము.

ఇలాంటి అనేక విశేషాలు తెలుసుకోవటానికి వెంటనే పైన "భక్తి - శక్తీ" అనే పేరు కింద కనబడుతున్న subscribe మీద క్లిక్ చేసి మీ email ఎంటర్ చేయండి. ఎలాంటి అనేక విశేషాలు మీకు నేరుగా పంపబడతాయి (ఉచితంగా). మీకు ఎలాంటి సందేహం ఉన్న ఈ కింద కామెంట్ లలో రాయవచ్చు. అలాగే మిసలహాలు కూడా ఇవ్వవచ్చు. ధన్యవాదాలు

శుభం భూయాత్

Source of information: Friend Messaged.

Comments