హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం శనివారం ఇవి చేయకుడదట.


1. శ‌నివారం రోజున కొత్త వాహ‌నాల‌ను అస్స‌లు కొన‌కూడ‌దు. అలాగే ఇనుప వ‌స్తువుల‌ను కూడా కొన‌కూడ‌దు. కొంటే ప్ర‌మాదాల బారిన ప‌డ‌తార‌ట. పండితులు కూడా ఇదే చెబుతారు. ఇనుప వ‌స్తువులు కొనేందుకు శ‌నివారం మంచిది కాద‌ని వారు అంటారు.

2. మినప పప్పును శ‌నివారం పూట కొన‌కూడ‌దు. తిన‌రాదు. కానీ దాన్ని ఆ రోజున వండి పేద‌ల‌కు దానమివ్వ‌వ‌చ్చు. లేదంటే కాకుల‌కు అయినా పెట్ట‌వ‌చ్చు. దీంతో శ‌ని సంతృప్తి చెందుతాడు. స‌త్ఫ‌లితాల‌ను ఇస్తాడు.

3. న‌లుపు రంగు మీ ఫేవ‌రెట్ క‌ల‌రా. అయితే ఆ రంగు ఉన్న దుస్తుల‌ను మాత్రం శ‌నివారం రోజున వేసుకోరాదు. అలా చేస్తే శ‌నికి ఆగ్ర‌హం వ‌స్తుంద‌ట‌. అంతా అశుభ‌మే క‌లుగుతుంద‌ట‌. శ‌ని స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తాడ‌ట‌.

4. ఆవాల‌ను శ‌నివారం పూట తిన‌రాదు. అలాగే ఆవ‌నూనెను కూడా. ఈ రెండింటినీ ఆ రోజున కొన‌రాదు కూడా. కానీ ఈ రెండింటితో చేసిన ఆహారాన్ని పేద‌ల‌కు దానమివ్వ‌వ‌చ్చు. లేదంటే ఆవ‌నూనెను శ‌నివారం పూట శ‌ని విగ్ర‌హంపై పోసి అభిషేకం చేయాలి. దీంతో శ‌ని సంతృప్తి చెంది మంచి ఫ‌లితాల‌ను ఇస్తాడ‌ట‌.

5. చెక్క ఫ‌ర్నిచ‌ర్‌ను కూడా శ‌నివారం పూట కొన‌కండి. ఒక వేళ ఆ రోజున వాటికి సంబంధించిన డెలివ‌రీ వ‌చ్చినా తీసుకోకండి. మ‌రుస‌టి రోజు డెలివ‌రీ తీసుకోండి. ఇలా చేస్తే శ‌ని స‌మ‌స్య‌ల‌ను సృష్టించ‌డు. అంతా మంచే చేస్తాడు

శుభం భూయాత్

Comments