మీ జాతకంలో అకాల మృతువు అని ఎవరైనా చెప్పారా? అయితే ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయండి. భయపడక్కర్లేదు.
చంద్రశేఖరుని చేత రక్షించబడిన మార్కండేయుడు రచించిన స్తోత్రం ఇది. దీనిని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారు వారికీ మరణ భయం అనేది ఉండదు. చాల మందికి జాతక దోషాల వల్ల అకార మరణం ఉంది అని ఎవరైనా చెప్తే, భయంగా ఉంటుంది. అటువంటి వారికీ ఇది పఠిస్తే చాలు, ఎలాంటి అకాల మరణం ఉండదట. అంతే కాదు దీనిని పఠించిన వారికి ఐశ్వర్యం కూడా చంద్రశేఖరుడు ఇస్తాడట.
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ |
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ||
రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ |
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 1 ||
మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ |
దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 2 ||
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ |
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 3 ||
పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ |
భస్మదిగ్ద కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 4 ||
యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణమ్
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ |
క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణమ్
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 5 ||
భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయఙ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ |
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 6 ||
విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ |
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 7 ||
భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమమ్ |
సోమవారిన భోహుతాశన సోమ పాద్యఖిలాకృతిం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః || 8 ||
మీ సలహాలు, సందేహాలు కామెంట్ లలో తెలుపగలరు!
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి