జ్యోతిష్యం ప్రకారం మానవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో అత్యంత ప్రభావితం కలిగిన సమస్యలలో కాలసర్ప దోషాన్ని ఒకటిగా పరిగణిస్తారు. మొత్తం తొమ్మిది నవగ్రహాలలోను ఏడూ నవగ్రహాలు రాహు, కేతు గ్రహాల మధ్య ఉన్నప్పుడు (బంధించబడటం) కాలసర్పదోషం ఏర్పడుతుంది. కాలసర్పదోషం వాళ్ళ అనేక దుష్ఫలితాలను ఎదుర్కోవటం సహజం వాటిలో కొన్ని వివాహం చాలా ఆలస్యం అవ్వటం, ఆరోగ్యం పాడవటం, ఆక్సిడెంట్స్ అవ్వటం, కారాగారానికి వెళ్ళటం, లేని పోనీ సమస్యలను ఎదుర్కోవటం, దాంపత్య జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవటం, భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండకపోవటం, తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవటం, ఉద్యోగాలు రాకపోవటం (ఆలస్యం అవ్వటం), ఉన్న ఉద్యోగాలలో అనేక సమస్యలు రావటం, వ్యాపారం లో నష్టాలు రావటం, ఎంతటివారైనా కిందకి రావటం లాంటి అనేక దుషఫలితాలు ఈ కాలసర్ప దోషాల వాళ్ళ వస్తాయి. అయితే ఈ కాలసర్ప దోషాలలో మొత్తం 12 రకాలు కలవు. వీటిని మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనుభవం ఉన్న జ్యోతిషులు చెప్తారు. వీటిలో ఒక్కొక్క రకమైనటువంటి కాలసర్పదోషానికి ఒక్కొక్కరకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీ జాతకంలో ఎలాంటి కాలసర్పదోషం ఉందొ తెలుసుకొని దానికి సంబందించిన పరిహారాలు చేసుకున్నప్పుడు మాత్రమే శాంతి జరిగి మీకు ఉపశమనం కలుగుతుంది. మీకోసం ఈ పన్నెండు రకాల కాలసర్పాల పేర్లు అవి ఎప్పుడు ఏర్పడతాయి అని క్లుప్తంగా క్రింద ఇవ్వటం జరిగింది. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటె లేదా మీ జాతక పరిశీలన కొరకు కానీ, మీకున్న జ్యోతిష్య దోషాలకు పరిహారాలు సంబందించిన వివరాలకు కానీ మమ్ములను కాంటాక్ట్ ఫార్మ్ ద్వారా సంప్రదించవచ్చు లేదా ఈ కింద కామెంట్ రూపంలో మీ సందేహాన్ని అడుగవచ్చు. ఈ బ్లాగ్ లోనే ఒక్కొక్క కాలసర్ప దోషం గురించి విడివిడి పోస్ట్స్ ద్వారా వివరంగా ఇవ్వటం జరిగింది. కావున అవసరమైనవారు పరిశీలించవచ్చు.
1 అనంత కాలసర్పదోషం: లగ్నంలో రాహువు ఉండటం వల్ల ఏర్పడుతుంది.
2 కుళిక కాలసర్పదోషం: ద్వితీయ స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
3 వాసుకి కాలసర్పదోషం: తృతీయ స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
4 శంకపాలా కాలసర్పదోషం: చతుర్థి స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
5 పద్మ కాలసర్పదోషం: పంచమ స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
6 మహాపద్మ కాలసర్పదోషం: షష్టమా స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
7 తక్షక కాలసర్పదోషం: ఏడవ స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
8 కర్కోటక కాలసర్పదోషం: అష్టమ స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
9 శంఖనాదా కాలసర్పదోషం: తొమ్మిదవ స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
10 పాథక్ కాలసర్పదోషం: పదవ స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
11 విషక్త కాలసర్పదోషం: పదకొండవ స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
12 శేష కాలసర్పదోషం: పన్నెండోవ స్థానంలో రాహువు ఉండటం వళ్ళ ఏర్పడుతుంది.
కారణం: మన పూర్వికులు ఏమైనా సర్పహింసా, బలి, తాడనా లాంటి, ఎలాంటి సర్పసంబంధ హింస చేసినా ఇలాంటి కాలసర్పదోషాలు వస్తాయి. ఈ కాలసర్పదోషాలు వంశపారంపర్యంగా అలా కొనసాగుతాయట. కానీ, పరిహారం చేయించుకుంటే చేయించుకున్న వారికీ ఉపశమనంతో పాటు, వారి ముందు తరాలకు రాకుండా ఉంటుందట.
నివారణ/పరిహారం: కాలసర్ప దోష నివారణకు అనేక మంది అనేక విధాలుగా చెప్తారు. ఉదాహరణకు, రాహు కేతు శ్లోకాలు చదవాలని. సర్ప ఉంగరం ధరించాలని. కానీ శాశ్వత పరిష్కారం కోసం మీరు ఈ క్రింది విధంగా చేయాలనీ అనుభవజ్జనులైన జ్యోతిష్యులు చెప్తున్నారు.
రాహువుకి 18,000 జపము, కేతువుకి 7,000 జపము, మానస దేవి మూల మంత్రం జపము చేయించి, సర్పసూక్త పారాయణము చేయించి, పూర్తయిన తర్వాత మండపంలో నవగ్రహాలను, మనసాదేవిని ఆవాహనం చేసి, ముందుగా చేయిపించిన జపాలలో దశాంశము ఆవుపాలతో క్షిరతర్పణాన్ని చేయించాలి. వెండితో చేయించిన రాహు కేతువులకు షోడశోపచార పూజలు, అభిషేకాలు గావించి, రాహువుకి గరిక, మినుములతోను, అదేవిధంగా కేతువుకి దర్భ, మినుములతో, మనసాదేవికి, సర్పమునకు చేరుకుతో హవానాన్ని జరిపించి శాస్త్రోతంగా పండితుల సమక్షంలో/సలహామేరకు పూర్తి చేసి. ఆ యొక్క వెండి సర్పాలను మినుములు, ఉలవలు,వస్త్రాలతో పటు బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. ఇలా చేసినవారికి దోష పరిహారం అవుతుందని చెప్తున్నారు.
ఇటువంటి అనేక విషయాలను, శ్లోకాలను, పరిహారాలను, తెలుసుకోవడానికి వెంటనే ఈ బ్లాగ్ కు subscribe అవ్వండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ లో వ్రాయండి. మేము స్పందిస్తాము.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి