శివాలయాన్ని ఇలా సందర్శించినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది.



శివాలయానికి వెల్లేముంది అసలు ఎవరు ఎలా సందర్శించాలో తెలుసుకోవడం ఇంతేనా అవశ్యం. శివాలయానికి వెళ్లి శివుని దర్శించడం ఎలానో ఈ పోస్ట్ లో క్లుప్తంగా మంత్రాలతో సహా వివరిస్తాము.

మొదటగా శివాలయం ఏ దిశా / ముఖంగా ఉందొ గమనించాలి అంటే తూర్పు నా లేక దక్షిణా లేక పడమర నా లేక ఉత్తరం గా నా అని. ఎందుకంటే శివుణ్ణి దర్శించేముంది ఇది తెలిస్తే అసలు మొదట శివునికి ఏ మంత్రంతో నమస్కరించాలి తెలుస్తుంది. (శివునికి 5 ముఖాలు ఉంటాయి అని అంటారు - దాన్ని అనుసరించి అన్నమాట) అంటే మీరు ఆలయంలో కి ప్రవేశించినపుడు శివుని ముఖం ఏ దిక్కు చూస్తుంది అనేది గమనించాలి.

ఉదాహరణకు, దక్షిణ దిక్కునకు శివాలయం ఉంది అనుకుందాం అంటే శివుడు దక్షిణం చూస్తున్నట్టుగా అన్నమాట. అప్పుడు మీరు ఆలయంలో కి ప్రవేశించినపుడు ఉత్తర ముఖంగా ప్రవేశిస్తారు. ఇలాంటి సమయంలో శివునికి ముందుగా దక్షిణ దిక్కు చూస్తున్నాడు కాబట్టి, దాని సంబంధిత మంత్రాన్ని జపించాలి.

వివరణ: మీరు గుడిలోకి వెళ్లిన వెంటనే శివుని చూసి శివుడు ఆ ముఖంగా ఉన్నదో ఆ మంత్రం జపించి, శివునికి కుడి వైపు, మనకు ఎడమ వైపు దిశగా ప్రదక్షిణ ప్రారంభించాలి . మొదటగా శివుని చుసిన వెంటనే ఆ దిక్కునకు సంబందించిన మంత్రం చెప్పి నమస్కరించాకా ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మరొక దిక్కుకు వస్తారు అంటే ఉదాహరణకు శివుడు పశ్చిమ దిశగా చూస్తుంటే మనం గుడిలోకి వెళ్ళేది తూర్పు ముఖం గా ఉంటుంది అప్పుడు పేషిమానికి సంబందించిన మంత్రాన్ని స్మరించి మనకు ఎడమ వైపు, స్వామికి కుడి వైపు గా ప్రదక్షిణ ప్రారంభించాకా మొదటగా మనకు దక్షిణ దిక్కు తగులుతుంది అప్పుడు శివాలయం పైకి చూసి (ఎందుకంటే గోడ వాళ్ళ శివుడు కనిపించదు కాబట్టి) దక్షిణ మంత్రాన్ని చదివి ముందుకు సాగాలి తర్వాత తూర్పు గా వస్తారు అప్పుడు తూర్పుకు సంబందించిన మంత్రాన్ని ఆతదుపరి ఉత్తరానికి వచ్చినపుడు ఆ మంత్రాన్ని స్మరించాలి. ఆకరిగా  ప్రదక్షినానంతరం శివాలయం లోకి వెళ్ళేటపుడు శివుని పైబాగం(నెత్తి భాగం) చూసి ఈశన మంత్రం జపించాలి.  ఈ మంత్రాలను కింద ఇవ్వడం జరిగింది.

పశ్చిమ: ఓం సద్యోజాత ముఖాయ నమః
దక్షిణ: ఓం అఘోర ముఖాయ నమః
తూర్పు: ఓం తత్పురుష ముఖాయ నమః
ఉత్తర: ఓం వామదేవాయ నమః
ఈశాన ముఖం(పైన): ఓం ఈశాన ముఖాయ నమః

శివాలయ ప్రదక్షిణాలు పెళ్లికానివారు రౌండ్ గా తిరగవచ్చు అంటే అభిషేక జాలం వెళ్లే తోవ దాటవచ్చు, కానీ పెళ్లి అయినా వారు దాటరాదు కాబట్టి పెళ్లి అయినా వారు కింద చూపిన విధంగా చండి ని దర్శించిన దగ్గర్నుంచి అభిషేక జాలం వేళ్ళ తోవా వరకు వెళ్లి మల్లి వెనక్కు వచ్చి (చండి దగ్గరకు) మల్లి వెనక్కు తిరగాలి (క్రింద ఫోటో చూడండి)



శివాలయంలో ఛండికి చాల ప్రాముఖ్యత ఉంది. చండి కి నమస్కరించకుండా శివాలయ దర్శనం పూర్తి కాదు. అంటే మనం మన నమస్కారంతో ఛండికి నేను స్వామి దర్శనానికి వచ్చాను అని చెప్పడం అన్న మాట. ఆయనకు కింద మంత్రం చెప్పి నమస్కరించాలి.

వృషం  చండం వృషం  చైవ  సోమసూత్రం  పునర్వ్రుషమ్  |
చండంచ సోమసూత్రంచ  పునశ్ఛన్దమ్ పునర్వ్రుషమ్  ||
శివప్రదక్షినేచైవ  సోమసూత్రం  న  లంఘయేత్  |
లంగాణాథ్సోమసూత్రస్య  నరకే  పతనం ధృవం  ||

శివుని దర్శనానికి వెళ్లేముందు నందీశ్వరునికి కూడా నమస్కారం చేయాలి. అంటే స్వామికి నేను వచ్చానని చెప్పు అనేట్టుగా అన్నమాట. తర్వాత దర్శనానంతరం నంది రెండు కొమ్ములనుంచి చూస్తూ క్రింద మంత్రం జపిస్తూ నందిని స్మృసిస్తూ శివుణ్ణి చూడాలి.

వృషస్య వృషణo దృష్ట్వా ఈశ్వరస్యావలోకనం
శృoగ మధ్యే శివం దృష్ట్వా కైలాసం భవతి ధ్రువం
ఇలాంటి అనేక విషయాలు మీకు నేరుగా రావటానికి వెంటనే పైన భక్తి - శక్తీ అనే పేరు కింద ఉన్న subscribe అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీ email అడ్రస్ ను ఎంటర్ చేయండి. (ఉచితంగా) ప్రతీ హిందూ మిత్రులు subscribe చేసుకుని తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. మీకు ఎలాంటి సందేహం ఉన్న లేక ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాన్ని తెలియచేయాలన్న కింద కామెంట్స్ లో రాయండి.  జై హింద్

 శుభం భూయాత్  

Comments