ఈ ఒక్క యంత్రాన్ని పూజిస్తే సకల యంత్రాలను పూజించినట్టే - అన్నీ యంత్రాలు ఇచ్చే ఫలితం ఈ ఒక్క యంత్రం ఇవ్వగలదట.


సాధారణంగా మన హిందువులు అనేక రకాల యంత్రాలను పూజిస్తారు. అవి వారికీ తెలిసినవారు లేదా గురువులు చెప్పిన సలహా మేరకు జరుగుతుంది. వీటిని వారికీ ఉన్న సమస్య ప్రకారం తగిన యంత్రాన్ని పూజించమని చెప్పటం జరుగుతుంది. అంటే వారికీ ఆర్థిక సమస్యలకు కుబేర యంత్రమని, వాస్తు దోషాలకు వాస్తు యంత్రమని ఎలా వారి సమస్యను బట్టి యంత్రాన్ని చెప్పటం జరుగుతుంది. కానీ. అన్నిటికంటే తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే. అన్ని యంత్రాలకంటే శక్తివంతమైనది అయిన ఈ యొక్క యంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్దలతో నిధ్యం పూజిస్తారో వారికీ దేనికి లోటు ఉండదు. అంతే కాదు. ఈ యొక్క యంత్రాన్ని పూజిస్తే చాలు సకల యంత్రాలను పూజించినట్టేనట.ఇది నేనో లేక వేరెవరో చెప్పింది కాదు. యంత్రాల గురించి మంచి అవగాహనా ఉన్న చాల చాల మంది మన గ్రంధాల ఆధారంగా వారి వారి అనుభవాల ఆధారంగా చెప్పబడింది. అదే శ్రీ యంత్రం. ఈ శ్రీ యంత్రాన్ని ఎవరైతే పూజిస్తారో వారికీ సకల యంత్రాలను పూజించిన ఫలితం వస్తుందట. డబ్బుకు, ఆరోగ్యానికి, కీర్తికి దేనికి లోటు ఉండదట. అయితే ఆ యంత్రం వల్ల కలిగే ప్రయోగానాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.


  1. శ్రీ యంత్రాన్ని పూజిస్తే ఎలాంటి కష్టమైన మాయమైపోతుంది (తీరుతుంది).
  2. డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక బాధలనుండి గట్టెక్కడానికి చక్కటి మార్గం- శ్రీ యంత్రం 
  3. సమాజం లో కీర్తి, గౌరవం ఏర్పడతాయట.
  4. శ్రీ యంత్రాన్ని పూజించేవారు వారు అనుకున్నది సాదించగలుగుతారట.
  5. మనశాంతి ఏర్పడుతుంది
  6. సకల సంపదలు కలుగుతాయి 
  7. శత్రువులు నశిస్తారు 
  8. ఆత్మస్థైరం కలుగుతుందట- దుఃఖం నశిస్తుంది
  9. ఆనందం కలుగుతుందట 
  10. పెళ్లి కానీ వారికీ పెళ్లి త్వరగా అవ్వటానికి సహాయ పడుతుందట
  11. మానసికంగా బాధపడేవారికి దీనిని పూజించటం వల్ల ఎలాంటి మానసిక బాధలు ఉండవట. 
  12. అనారోగ్యంతో బాధపడేవారికి, అన్ని అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయట.
  13. సర్వ సిద్ధులను ప్రసాదించగల అతి శక్తివంతమైన యంత్రం శ్రీ యంత్రమట 
  14. సమస్త గ్రహదోషాలు, కాలసర్పదోషాలు, కుజ దోషాల నుండి ఎంతో ఉపశమనం ఏర్పడుతుంది.
  15. మీరు తలపెట్టిన పని విజయవంతంగా పూర్తి అవుతుందట 
  16. ఎవరైతే ఈ యంత్రాన్ని పూజిస్తారో వారిని అదృష్టం వరిస్తుంది 
  17. మీ అన్ని కోరికలు నెరవేర్చగల అత్యంత శక్తివంతమైన యంత్రం
  18. దుష్ట శక్తులను మీ దగ్గరకు కూడా రాకుండా చేసేంత శక్తివంతమైన యంత్రం.
  19. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే, ఎవరైతే శ్రీ యంత్రాన్ని పూజిస్తారో వారికి దేనికి ఎలాంటి లోటు ఉండదు. అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు.


అంతేకాదు శ్రీ యంత్రాన్ని ధరించినవారికి ఇంకా గొప్ప ఫలితాలు ఉంటాయట. ధారణ యంత్రాల గురించి ఈ బ్లాగ్ లోనే వేరే పోస్ట్ లో రాయబడింది. చూడండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటె కింద కామెంట్స్ లో రాయండి. మేము స్పందిస్తాము.

ఇలాంటి అద్భుత విషయాలు మీకు నేరుగా మెయిల్ రావటానికి, వెంటనే subscribe chesukondi  ఉచితంగా(పైన "భక్తి-శక్తీ" అనే పేరుకింద ఉంది చూడండి)


శుభం భూయాత్.

Comments